5 May, 2026 | 3:34 PM

వీరభద్రస్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు

05-05-2026 02:05 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మెదక్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత రఘునందన్ రావు మంగళవారం జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఎంపీ రఘునందన్ రావుకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాద ప్రకారం స్వాగతం పలికి, స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం  అందజేశారు.