సీఎం పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా
చెన్నై: 2026 ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections Results 2026) ఎదురైన భారీ ఎదురుదెబ్బ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(MK Stalin resigns) చేశారు. ఈ మేరకు ఒక అధికారిక లేఖను రాజ్‌భవన్‌లోని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు(Rajendra Arlekar) పంపారు.స్టాలిన్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. 2011 నుండి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తన కంచుకోట అయిన కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ వ్యక్తిగత పరాజయాన్ని చవిచూశారు.
తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam)కు చెందిన వి.ఎస్. బాబు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తద్వారా, తమిళనాడు చరిత్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అరుదైన సిట్టింగ్ ముఖ్యమంత్రులలో ఒకరిగా నిలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఎదిగి అధికార డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు బిగ్ షాకిచ్చింది. విజయ్ పార్టీ తమిళనాడులో 108 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. టీవీకే పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే దళపతి విజయ్ నుంచి తమిళనాడు సీఎం అయి ప్రభంజనం సృష్టించారు. తమిళనాడు అధికారంలోకి వచ్చిన టీవీకే అధినేతకు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.






