5 May, 2026 | 3:41 PM

Breaking News

మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు   •   ఖామనలో జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రచారం   •   TVK శాసనసభాపక్ష నేతగా విజయ్   •  

ఆపదలో అండగా నిలిచిన ఎన్నారై.

05-05-2026 02:12 PM

- మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామానికి చెందిన నాయిని నరహరి ఇటీవల వేములవాడ నందికామాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి ప్రముఖ ఎన్నారై అంబోజ వెంకటేష్ చేయూతనందించారు. సుద్దాల గ్రామానికి చెందిన ఎన్నారై అంబోజ వెంకటేష్ మృతుని భార్య రేణుకకు రూ.5 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ క్లిష్ట సమయంలో రేణుకకు ఎల్లవేళలా అండగా ఉంటామని, అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసంపల్లి శ్రీనివాస్, నాయకులు ఎం. శ్రీనివాస్, మాసం సుమన్, మాసం బాబు, మాసం సందీప్, కారోబార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.