5 May, 2026 | 3:09 PM

దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

05-05-2026 01:37 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామ్ దుర్గా రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డివిజన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్‌ను శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు. మారుమూల ప్రాంతమైన దేవరకొండకు రావడం ఆనందదాయకమని, పేద వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.