అగ్నిపర్వతం మీద విరిసిన పారిజాతంలా..
జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ యాక్షన్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో రషా థడానీ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తు న్నారు. నిర్మాత పీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సమర్పిస్తు న్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిని మా జులై 30న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని ‘ఉక్కిరి బిక్కిరి’ అనే పాటను విడుదల చేశారు. ‘అగ్నిపర్వతం మీద విరిసిన పారిజాతంలా.. ఉప్పు సముద్రంలో కురిసిన తేనె వర్షంలా.. నువ్వు నన్ను చూస్తుంటే.. నవ్వుతూ ఉంటే.. సరికొత్తగా నాకే ప్రాణం పోస్తే ఉక్కిరిబిక్కిరి.. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా.. ఇక్కడకిక్కడ చుక్క ల ఊయల ఊగేస్తున్నా..’ అంటూ సాగుతోందీ గీతం. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, హరిచరణ్ ఆలపించారు.






