16 నుంచి ఒంటిపూట బడులు
- ఉదయం 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : రాష్ట్రలో చలి తగ్గి ఎండల తీవ్ర త పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా యి. దీంతో ఒంటిపూట బడులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బడులన్నీ ఒంటిపూట నడవనున్నాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉత్తర్వుల్లో మార్చి 15న ఆదివారం నుంచి ఒంటిపూట బడులని ఉండటం గమనార్హం. దీంతో మార్చి 16 నుంచి ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12.30 గంటలవరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్ర భుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పం పించేస్తారు.
పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మ ధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఒంటిపూట బడు లు నిర్వహించనున్నారు. ఉ ద యం సెషన్‌లో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అకడమిక్ క్యాలెం డర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండగా, 2026-27 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి మొదలుకానున్నది.




