calender_icon.png 8 February, 2026 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజూ రూ.కోటి స్వాహా!

08-02-2026 12:53:55 AM

  1. నగరంలో సైబర్ నేరగాళ్లది హైజాక్ రాజకీయం
  2. పైసా పోతే గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయండి
  3. ‘జాగ్రత్త.. సురక్షిత హైదరాబాద్’లో సీపీ సజ్జనార్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు కేవలం మీ బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయ డం లేదని.. మీ భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, చివరికి మనశ్శాంతిని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సైబర్‌నేరగాళ్లు రోజూ కోటి రూపాయలు స్వాహా చేస్తున్నారని వివరించారు.

శనివారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ‘జాగ్రత్త హైదరాబాద్.. సురక్షిత హైదరాబాద్’ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసం గించారు. సైబర్‌నేరాల వల్ల కలిగే నష్టం బాధితుల జీవితకాలం కోలుకోలేని విధంగా మారుతోందని ఆయన హెచ్చరించారు. విద్యావంతులనే టార్గెట్ చేసుకుని నగరంలో రోజుకు సగటున రూ.1 కోటిని కొల్లగొడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా విద్యావం తులే లక్ష్యంగా నకిలీ సెబీ సర్టిఫికెట్లు చూపి స్తూ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. బం గారం, వెండి ధరల హెచ్చుతగ్గులను సాకు గా చూపి అపరిచితులు చేసే ట్రేడింగ్ ప్రతిపాదనలను నమ్మొద్దన్నారు. ఇటీవల డిజిట ల్ అరెస్ట్ అనే సరికొత్త మోసం ప్రబలుతోందని సీపీ హెచ్చరించారు. నకిలీ పోలీస్ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేస్తూ, బాధితులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు భ్రమ కలిగించి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నా రు.

అలాగే తెలియని వ్యక్తులు పంపే హానికర ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, సామా జిక మాధ్యమాల్లో వ్యక్తిగత చిత్రాలను పం చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోన్‌యాప్స్, ఓటీపీ షేరింగ్ పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దురదృష్టవశాత్తూ సైబర్ మోసాని కి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్(నేరం జరిగిన మొదటి గంట) లోపు 1930 నంబర్‌కు కాల్ చేయాలని సీపీ సూచించారు.

అప్పుడే సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్‌చేసి తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీలు బీ రాజేష్, వీ అరవింద్‌బాబు, ఏసీపీలు శ్రీకాంత్‌గౌడ్, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.