14 May, 2026 | 12:45 PM

కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ కేసు.. ముగ్గురు దొంగలు అరెస్ట్

14-05-2026 11:51 AM

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) నగల దుకాణంలో దోపిడీ కేసులో ముగ్గురిని అరెస్టు  చేశామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం(Karimnagar CP Ghouse Alam) వెల్లడించారు. ఈ నెల 3న కరీంనగర్ లోని PMJ జ్యువెలరీ షాపు(PMJ Jewellery Robbery Case) దోపిడీ కేసులో పట్టుబడిన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.... ఐదుగురు నిందితుల్లో రఘునాథ్, రమేష్ కుమార్, మెహతాబ్ ఖాన్ అనే ముగ్గురిని పట్టుకున్నామని చెప్పారు. 11 గంటల 11 నిమిషాలకు షాపులో కాల్పులు జరిగాయని తెలిపారు.

దోపిడీ ముఠా కాల్పుల్లో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయని, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ ముఠాపై 7 రాష్ట్రాల్లో 42 కేసులున్నాయని, కరీంనగర్ , పెద్దపల్లిలో ఈ ముఠా రెక్కీ నిర్వహించినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 51 వేలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 10 రోజుల్లో దోపిడీ గ్యాంగ్ ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ ముఠాలో మరో పది మంది నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.