calender_icon.png 6 February, 2026 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వప్న హంతకులను శిక్షించాలి

06-02-2026 12:56:13 AM

ఇబ్రహీంపట్నంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహిళా న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధుల ను బహిష్కరించారు. స్వప్నకు శ్రద్ధాంజలి ఘటించి, హంతకులను కఠినంగా శిక్షించాలని ఫాస్ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా న్యాయవాదుల చట్టం తీసుకురావాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతూ, ఉద్యమాలు చేస్తున్నా స్పందించకుండా ఆలస్యం చేయడం వల్లనే ఈ దాడులు హత్యలు జరుగుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని కోరారు.

లే దంటే రిలే నిరాహార దీక్షలు, పాదయాత్రలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజభవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి న్యా యవాదుల చట్టం తీసుకురావడానికి సహకరించాలని అసెంబ్లీలో చర్చకు తీసుకరావా లని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమం లో అసోసియేషన్ ఉపాధ్యక్షులు భాస్కర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మల్లేష్, రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు అంజన్ రెడ్డి, అశోక్, రవీందర్ రెడ్డి, జెపి మహేందర్, రవి కిరణ్, మురళి, నారాయణ రెడ్డి, డి. శ్రీనివాస్, జక్కుల జగన్, శ్రీశైలం, శ్రీకాంత్, భా ను, మధు,రాజకుమార్, మహిళా న్యాయవాదులు ఎన్. మాధవి, రజిని పాల్గొన్నారు.