ఓ..! సుకుమారి పక్కా కుటుంబ కథాచిత్రం
యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేశ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం తెలు గు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “కుటుంబసభ్యులు, పిల్లలు కలిసి చూసిన సినిమా చాలాకాలం గుర్తుండిపోతుంది. అలాంటి సినిమాలకు లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి విజయమే ఈ సినిమాకు దక్కుతుంది.
సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు” అని తెలిపారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. “హీరోయిన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుం దనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేదనుకుంటా. నిజానికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌ను ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపించేది. ఈ కథ విన్న తర్వాత అలాంటి మనుషులు నిజం గా ఉంటారేమో అనిపించింది. కథతో చాలా కనెక్ట్ అయ్యా.
ఈ సినిమా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా” అని తెలిపారు. ‘తప్పకుండా ఈ సినిమా అందరికి కొత్తగా వినోదం పంచుతుంద’ని డైరెక్టర్ భరత్ దర్శన్ చెప్పారు. ‘చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు జీవన్, గవిరెడ్డి, డీవోపీ కుషేందర్ కూడా మాట్లాడారు. మూవీటీమ్ అందరూ పాల్గొన్నారు.






