5 August, 2026 | 2:42 AM

బాబోయ్.. ఇవేం దొంగతనాలు

05-08-2026 01:21 AM
  1. ఒకవైపు ఇండ్లు.. మరోవైపు గుడులు దోపిడీ
  2. తగ్గని చైన్ స్నాకింగ్ కేసులు 

భైంసా, ఆగస్టు 4 ( విజయ క్రాంతి): ని ర్మల్ జిల్లాలో దొంగతనాలకు అంతే లే కుం డా పోతుంది. జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన దొంగతనాలు ఎందుకు నిదర్శనం. దొం గతనాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన జిల్లాలో దొంగతనాలు ఆగకపోగా మరింత పెరగడం ప్రజలను భ యాందోళనకు గురిచేస్తోంది.

దొంగతనం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న నిర్మల్ జిల్లాలో మాత్రం దొంగల ముఠా రెచ్చిపోతూ దొంగతనాలకు పాల్పడడం పోలీస్ శాఖకు సవా ల్గా మారింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ కడెం లోకేశ్వరం కుంటాల బైంసా బా సర్ కుబీర్ ముధోల్ లక్ష్మణ్ చందా తదితర ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసిన ఇండ్లతోపాటు అపార్ట్మెంట్లు, ఆలయాలు వరుస చోరీ ఘటనలు చోటు చూసుకోవడం జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుంది.

ఆలయాలు,తాళం వేసిన ఇల్లే టార్గెట్ 

నిర్మల్ జిల్లాలో గత నెల రోజులుగా జరుగుతున్న దొంగతనాలు తాళం వేసిన ఇళ్లతో పాటు దేవాలయాల టార్గెట్గా దొంగలు దోపి డీ చేస్తున్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేం ద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రంలో ఉన్న నాలుగు ఆలయాలు వెండి కిరీటంతో పాటు ఉండి డబ్బులను దూసుకెళ్లారు. అంతకుముందు బాసరలో ఇదే తరహా దొంగతన దొంగలను పట్టుకొని అరెస్టు చేశారు. అలాగే బైంసా పో నకల్ విశ్వనాథ్ పెట్ లోకేశ్వరం తదితర ప్రాంతాల్లో ఆలయాలు చోరీ జరిగిం ది.

విగ్రహాలపై ఉన్న వెండి బంగారంతో పా టు హుండీలో భక్తులు వేసిన నగదును దో పిడి దొంగలు దోచుకున్నారు. దీనికి తోడు నిర్మల్ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు అపార్ట్మెంట్లో దొంగతనం జరి గింది. ఒక్కొక్క రోజు ఐదు చోట్ల దొంగతనా లు జరగడం ప్రజలకు రాత్రి వేళలో కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరోపక్క జిల్లాలో గొలుసు దొంగతనం పెరుగుతున్నా యి. ఆదివారం సాయంత్రం ప్రియదర్శిని నగర్ కు చెందిన ఓ వృద్ధురాలు మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. జిల్లాలో ఒంటరిగా మహిళలు వెళ్తున్న వారిని గుర్తించి పథకం ప్రకారం నంబర్ లేని మోటర్ వానాలతో హెల్మెట్లు ధరించి చాకచక్యంగా దొంగతనం చేస్తున్నారు.

బస్టాండ్ రద్దీ ఉన్న ప్రదేశాల్లో వరస చో రీలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇం టికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అంతకుముందు పట్టణంలోని ఆ దర్శనగర్ రామ్ నగర్ కాలనీలో సూర్యుడు జరగా దిల్వార్పూర్ లో కూడా రెండు ఇం డ్లలో దొంగలు పడి దోచుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దొంగతనాలు నేతలకు గస్తీ బుందాలను ఏర్పాటు చేసుకుని రాత్రి ళ్ళు తిరుగుతున్నారు. దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ అన్ని గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు పథకం ప్రకారం వాటిని ముందుగానే ధ్వం సం చేసి దోపిడీకి పాల్పడుతూ తప్పించుకుంటున్నారు. నిర్మల్ ప్రాంతంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పో లీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండి ప్రజలను చేతను చేస్తూ దొంగతనాలు నేతలకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో పెంచిన నిఘ 

నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ దిద్దిపాటి చర్యలు ప్రారంభించింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రధాన మార్గాలపై రాత్రి వేళలో చెక్ పోస్టులు పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

 గ్రామాల్లో పట్టణా ల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారి వివరాలను సేకరిస్తున్నకు తెలిపారు. దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ అన్ని చ ర్యలు తీసుకొని ప్రజలు కూడా తమకు సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.