9 April, 2026 | 5:08 AM

విజయక్రాంతి కథనాలకు అధికారుల స్పందన

09-04-2026 01:14 AM
  1. సర్టిఫికెట్ జారీ విషయంలో కలెక్టర్ ఆగ్రహం 

ప్రభుత్వ ఆస్తిని ఎలా రాసిస్తారు 

హుటా హుటిన ఆర్డీవోను పిలిచి వివరాల సేకరణ 

సర్టిఫికెట్ రద్దు తో పాటు చర్యలకు సిద్ధమైన అధికారులు 

కరీంనగర్: ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నిలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ భూమి ఆలయం హక్కుదారుగా కాంగ్రెస్ నేత కోస రవీందర్ కు జారీ చేసిన సర్టిఫికెట్ విషయంలో కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఆలయాన్ని ఒక వ్యక్తికి తాసిల్దార్ హక్కుదారిగా రాసి ఇవ్వడం ఏమిటని కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో విజయ క్రాంతి దినపత్రిక వివరాలతో గత మూడు రోజులుగా వరుస కథనాలు ఇవ్వడంతో అధికారులు స్పందించి విచారణ జరుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా మంగళవారం సాయంత్రం వేములవాడ ఆర్డీవో రాధా బాయి ని హుటాహుటిన కలెక్టర్ తన కార్యాలయానికి పిలిపించుకుని సర్టిఫికెట్ జారీ చేసిన వివరాలను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం కలెక్టర్ గరీమ అగర్వాల్ నీలోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్ కు తన కార్యాలయంలో కలిసేందుకు సమయం ఇవ్వగా ఆయన గ్రామస్తులతో కలిసి సమగ్ర వివరాలు ఆధారాలు తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో సర్పంచులను గ్రామస్తులను పోలీసులు కలెక్టరేట్ బయట అడ్డుకొని సర్పంచ్ భాస్కర్ ను ఒకరిని కలెక్టర్ కార్యాలయం పంపించారు.

ఈ తరుణంలో ఆయన కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు కాపీని తాసిల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని, ఆలయాన సంబందించిన వివరాలను ఆయన కలెక్టర్ కు అందించారు. పరిశీలించిన కలెక్టర్ రిపోర్టు చేసిన ఆర్‌ఐ, సర్టిఫికెట్ జారీ చేసిన తాసిల్దార్ పై మండిపడినట్లు తెలిసింది. 24 గంటల్లో సమస్య పరిష్కారం చేసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటానని సర్పంచ్ అణువుల భాస్కర్ కు కలెక్టర్ గరీమ అగర్వాల్ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ భాస్కర్ తెలిపారు.

ఈ విషయం మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ను విజయ క్రాంతి ఫోన్ లో  మాట్లాడి వివరణ కోరగా విచారణ జరుగుతుందని అందుకు కొంత సమయం పడుతుందని సర్టిఫికెట్ ను ఆర్డిఓ రద్దు చేయాల్సి ఉంటుందని చెప్పారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ విషయంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

సర్టిఫికెట్ జారీ విషయంలో చక్రం తిప్పిన అధికారి ఎవరు 

బోయినపల్లి మండలం నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ రామాలయం సర్టిఫికెట్ జారీ విషయంలో చక్రం అధికారి ఎవరు అని ఇప్పుడు జిల్లాలో రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న సమయంలో సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణ విభాగంలో పనిచేసిన అధికారి ఒకరు కాంగ్రెస్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించి ఒకేరోజు క్షేత్రస్థాయికి వెళ్లి విచారం జరిపి సర్వే నెంబర్ సేకరించి తాసిల్దార్ కు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.

ఆయనపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కులం ఇతర సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకున్న బాధితులకు విచారణ జరిపి సర్టిఫికెట్  జారీ చేసేందుకు మాత్రం రూల్స్ పాటించి వారం పది రోజులు కావాలని ఉన్న అధికారికి ఇక్కడ రూల్ ఎందుకు కనిపించలేదని మండల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత మన్నన పొంది , వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక రోజులో విచారణ జరిపి నివేదిక ఇస్తారని ఆ శాఖ అధికారులే తీర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం స్వపక్ష విపక్ష నేతలకు కార్యకర్తలకు ,ప్రజలకు చక్కగా పనిచేసిన తాసిల్దార్ మాత్రం ఇందులో ఇరుక్కుపోయారని ఆ పార్టీ నేతలే బహిరంగ చర్చించుకుంటున్నారు.