21-02-2026 02:22:13 AM
ఖానాపూర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీలోని పన్నుల బకాయిలు అధిక మొత్తంలో ఉన్న వారిపై ఆ శాఖ రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా రు. ఈ మేరకు అధిక మొత్తంలో బకాయిపడ్డ వారికి మొదటగా రెడ్ నోటీసులు ఇచ్చి కట్టకపోవడంతో వారి ఆస్తులకు తాళం వేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఒక ఇంటికి తాళం వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రామకృష్ణ ,ఆర్‌ఐ రాజు తదితరులు ఉన్నారు.