31 August, 2026 | 2:14 AM

జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి

31-08-2026 01:02 AM
  1. లేకుంటే పార్లమెంట్  సమావేశాలను అడ్డుకుంటాం
  2. మహానీయుల చరిత్రను విశ్వవ్యాప్తం చేస్తాం
  3. బీదర్ బీసీ సభలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

బెంగళూరు, ఆగస్టు 30: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కాలం పెట్టి తీరాల్సిందేనని, లేకుంటే వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీ నివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా కేంద్రంలోని ఎంఎమ్ క్లాసిక్ గార్డెన్‌లో బీసీ సంఘాలు, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త బ్రహ్మశ్రీ నారాయణ గురు, కర్ణాటక బీసీ నేత దేవరాజ్ అరసు జయంతులను పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సభలో కర్ణాటక పీసీసీ అధ్యక్షులు బికే హరిప్రసాద్, కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈశ్వర్ కాం డ్రే, మాజీ మంత్రి రహీమ్ ఖాన్, బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షు లు కేసన శంకర్‌రావులు పాల్గొన్నారు. సం ఘసంస్కర్త నారాయణ గురు, దేవరాజ్ అర సు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు నారాయణ గురు చిత్రపటంతో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ సమానత్వం, శాస్త్రీయమైన సమాజం కోసం, అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి తమ విలువైన జీవితాల ను ఫణంగా పెట్టిన మహనీయుల చరిత్రలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న బీసీ జనాభా లెక్కలు తేలితేనే వారికి చట్టబద్ధమైన హక్కు లు దక్కుతాయన్నారు. ఓబీసీ కాలం చేర్చకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని ఆరో పించారు.

సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ఓబీసీ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, 29 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తారని జాజుల తెలిపారు. ఈ సమావేశానికి డాక్టర్ రాజశేఖర్ అధ్యక్షత వహించ గా జాతీయ సమన్వయకర్త రామ కోటేశ్వరరావు, బీదర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత్ చింకోడు, సంగయ్య గౌడ్, ప్రొఫెసర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.