20-02-2026 04:45:23 PM
జిల్లా పరిషత్ సీఈవో నరేందర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): గర్భిణీ మహిళలు, బాలింతల ఆరోగ్య కొరకు అంగన్వాడి సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ కే. నరేందర్ అన్నారు. వార్డు సభ్యుల ఐదు రోజుల శిక్షణలో భాగంగా నాలుగవ రోజైన శుక్రవారం మహిళా శిశు సంక్షేమంపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ మాట్లాడుతూ అలాగే వేధింపులు, గృహింస వల్ల ఇబ్బందుల పడే మహిళలు ఆడపిల్లల సంక్షేమం కొరకు సఖి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అనాధ పిల్లల కోసం హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు.
అలాగే ఆడ పిల్లల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా ఉన్నత చదువులు చదివిపించాలని శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు తెలిపారు. అలాగే గ్రామాలలో ప్రతి వార్డు స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి గ్రామపంచాయతీ ద్వారా వాటిని పరిష్కరించుకునేందుకు తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి దివ్యదర్శన్ రావు , మండల పంచాయతీ అధికారి మౌనిక , అదనపు సిడిపిఓ అంగన్వాడీ సూపర్వైజర్లు సంబంధిత పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.