రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ఎన్‌ఎస్‌వీ జూనియర్ కళాశాల విద్యార్థులు
జగిత్యాల, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి): ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలలో రామకృష్ణ విద్యాసంస్థలకు చెందిన శ్రీ ఎన్ ఎస్ వి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు. ప్రథమ సంవత్సరము బైపిసి విభాగంలో ఎం. సంజన 437/440, ఎంపీసీ విభాగంలో బి లిఖిత 467/470, ఆర్ శ్రీ చైత్ర , ఎస్ అనూష, పి శివప్రియ 466/470 సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగం నందు టీ. లావణ్య 989/1000, ఎస్ కీర్తి 988/1000, డి సహస్ర 985/1000,BPC విభాగంలో షా గుప్తా 974/1000,సీఇసీ విభాగంలో ఎం ఆకాష్ 938/1000 సాధించి ప్రతిభ చాటారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, సహకరించిన పోషకులకు, అధ్యాపక సిబ్బందికి కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ , ప్రిన్సిపాల్ పల్లెర్ల నరేష్, అభినందనలు తెలియజేశారు.






