15 April, 2026 | 3:02 AM

మాసానిపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులంతా కాంగ్రెస్ వైపు

15-04-2026 12:04 AM

ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అభివృద్ధి ప్రభావం

నాగిరెడ్డిపేట్,ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామంలో రాజకీయ పరిమాణం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డితో పాటు వార్డు సభ్యులందరూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమయ్యాయి.

సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు,ఎస్.హెచ్.జి భవనం ధాన్యం నిర్వ గోదాం వంటి కీలక అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంజూరు చేయడంతో గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ సర్పంచి పెద్దపట్లల సునంద కిషన్ రెడ్డి, మరియు పాలకవర్గం తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మాసానిపల్లి గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులను సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ పరిమాణంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజకీయాలు రాజ్యాంగ సంచరించుకుంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరిగే విట్టల్, మండల సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, రామచంద్రారెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

నాగిరెడ్డిపేట్,ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేటలో 20 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భూమి పూజ చేశారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలం కేంద్రం గోపాల్పేట్లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సుమారు 20 లక్షల,,వ్యాయామంతో నిర్మించనున్న ఆరు గదుల షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులతో,కాంగ్రెస్ నాయకులతో,కార్యకర్తలతో కలిసి మంగళవారం భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ...ప్రాంతీయంగా చిన్న వ్యాపారులకు వాణిజ్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని తెలిపారు.ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అలాగే ఈకార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో రాజేశ్వర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి,రామచంద్రారెడ్డి, క్రిస్టఫర్,ఫారూఖ్,నిరుడి రాజు,మన్నె వెంకట్,గడ్డం బాల్రెడ్డి,ఇమాం,గులాం హుస్సేన్,భాస్కర్ రెడ్డి,దివిటి కిష్టయ్య,సురేందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.