1 April, 2026 | 4:26 AM

ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ తాగునీటి కానుక

01-04-2026 01:03 AM

మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంస్థ

ఖమ్మం, మార్చి 31(విజయక్రాంతి): లకా రం ట్యాంక్ బండ్‌కు ప్రతిరోజూ ‘నడక’ కోసం అలాగే సందర్శకులుగా వేల సంఖ్య లో వస్తూ ఉంటారు. వాళ్ల అవసరాలను దృ ష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ ద్వారా చల్లని తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.అందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ షెడ్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. మంగళవారం లకారం ట్యాంక్ బండ్ మీద వాటర్ ప్లాంట్‌ను ప్రారంభోత్సవం చేశారు.కొంతకాలం క్రితం వాటర్ ప్లాంట్ అవసరాలు ప్రముఖుల ద్వారా జయ శేఖర్ తాళ్లూరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరం ఎలాంటిదైనా పదిమందికి ఉపయోగ పడే కార్యక్రమంలో చేయూత నివ్వడానికి ఎప్పుడూ సహకరిస్తామని తెలిపారు. డిస్ట్రిక్ట్ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ బాధ్యులు శ్రీ బయ్యన బాబురావు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖ మ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునకొల్లు నీరజ గారు, శ్రీ జయశేఖర్ తాళ్లూరి, డీఎన్‌ఎఫ్ బండి నాగేశ్వర్ రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా బేగం,

కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, అన్నం ఫౌండేషన్ అన్నాం శ్రీనివాసరావు,తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ బాధ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, కమ్మ సంఘం లక్ష్మణ్ రావు దండ్యాల, వాకర్స్ చం ద్రయ్య చావా లక్ష్మీనారాయణ, పీస్ యోగా విద్యాలయం షేక్ బహార్ అలీ, రోటరీ క్లబ్ పసుమర్తి రంగారావు, ఇంకా అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఒక నిరుపేద విద్యార్థిని సమ్మక్కకి ఎన్‌ఆర్‌ఐ లెనిన్ చౌదరి ఆర్ధిక సహాయంతో (50వేల) లాప్ టాప్ ను అందించారు, ఎన్‌ఆర్‌ఐ శివ మాటేటి, శివ నాయుడు ఆర్థిక సహాయంతో,8 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.