17 June, 2026 | 9:56 PM

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్

17-06-2026 08:39 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియాలొ ఆర్.సి.ఓ.ఏ, క్లబ్ నందు జరిగిన 20 వ ఏరియా లెవెల్  ట్రైపాటైడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్లొ రీజియన్ లో ఉన్న ఏరియాలు కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్, సత్తుపల్లి ఏరియా, ఇల్లందు ఏరియా,లతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి సంస్థ డైరెక్టర్లు, మూడు ఏరియాల జనరల్ మేనేజర్లు, మూడు ఏరియాల లోని మైన్సు ఓపెన్ కాస్ట్, డిపార్ట్మెంట్లల హెచ్ఓడిలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాల అమలు, కార్మికుల సంక్షేమం, పనిస్థలాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భద్రతపై అవగాహన పెంపు, సమన్వయంతో పని చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ ఏరియా వర్క్ షాప్ పంపు సెక్షన్, మిషన్ షాప్ సెక్షన్, ఎలక్ట్రికల్ ఇండోర్ ల యందు ఈ.ఓ.టి, ఏర్పాటు చేయాలని, అలాగే రామవరం నుండి గౌతమ్ పూర్ వరకు ఏరియా పెద్దది అయినందున ఎలక్ట్రికల్ ఏరియల్ టవర్ వ్యాగన్ కొత్తది ఏర్పాటు చేయాలని, ఒక ఫోర్క్ లిఫ్టర్  ఏర్పాటు చేయాలి.

లేటెస్ట్ మోడల్ స్లింగ్స్ కొత్త టైపు ఏర్పాటు చేయాలి.అలాగే మైన్ లాభనష్టాలతో సంబంధం లేకుండా సేఫ్టీ వస్తువులపై అమౌంట్ పెంచే విధంగా, సెల్ఫ్ రెస్క్యూ తోపాటు గ్యాస్ మరియు చెకింగ్ చేసేటప్పుడు గ్లాసు ఉండే విధంగా, సేఫ్టీ లైట్ కూడా ఏర్పాటు చేయాలి. ఐ.ఈ.డి, నామ్స్ అంటే ఏమిటి, ప్రతి మైన్స్, ఓపెన్ కాస్ట్, డిపార్ట్మెంట్లలో మ్యాన్ పవర్ తోపాటు సూపర్వైజర్స్, మైనింగ్ స్టాప్, టెక్నీషియన్స్, ఫోర్ మెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు,ఏ లెక్క ప్రకారంగా మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు దీని విధివిధానాలు తెలియజేయాలి. అలాగే ప్రతి మైన్ ఓపెన్ కాస్ట్, డిపార్ట్మెంట్లలో మ్యాన్ పవర్ అన్ని కేటగిరీలు పెంచే విధంగా చూడాలి.

పీ.వీ.కే, మైన్స్ నుండి బోర్ హోల్స్  రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి దానికి తారు రోడ్డు ఉంది మిగతా మూడు బోర్ హోల్స్ అర కిలో మీటర్ల దూరంలో ఉన్నవి మొత్తం మూడున్నర కిలోమీటర్లు,అర కిలోమీటర్ దూరంలో ఉన్న బోర్ హోల్స్ కి రోడ్డు సదుపాయం లేక జంతువులు, విష పాములు సంచరించుచున్నవి దారి లేక   ఇబ్బందికరంగా ఉంది, ఫారెస్ట్ వాళ్లు కూడా దారి ఇవ్వకపోవడంతో వర్షాకాలం వచ్చినప్పుడు ఉద్యోగులు అక్కడే రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది, కావున దారి పక్కన సేఫ్టీ తో పాటు  ఫెన్సింగ్ మరియు వెహికల్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది, మెడికల్ సంబంధించిన ఎన్నో ఎన్ ప్యానల్ హాస్పిటల్స్ ఉన్నవి వాటిలో హైదరాబాద్ వెళ్తే సరైన వైద్యం అందటం లేదు, సరైన  మిషనరీ ఉండటం లేదు, కాబట్టి ఒకసారి ఎంక్వయిరీ చేసి ఏమేమి హాస్పిటల్లో ఉంచాలా ఏమేమి తీసెయ్యాలా అనేది యూనియన్ ప్రతినిధులతో పాటు యాజమాన్యము కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి,

ఎన్ పానెల్ లో ఉన్న 20 హాస్పిటల్ కేవలం సింగరేణి పేరు మీదనే నడుస్తున్నాయి.  ఎంక్వయిరీ చేయించి వాటిని తీసివేయాలి సౌదా ప్రైవేట్ కంపెనీ లో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని  ప్రైవేట్ వెహికల్స్ ఎన్నో ఉన్నవి, కంపెనీకి అనుభవరాహిత్యం ఎంత ఉంది, ఇప్పటివరకు చాలా యాక్సిడెంట్ జరిగినవి,వాటిలో ఈమధ్య వాల్వో ఫైర్ అయినది, అలాగే వాటర్ స్లింకర్ ట్యాంకర్  బోల్తా పడ్డది, ఎలక్ట్రికల్ సంబంధించిన జీబు ఎలక్ట్రికల్ పోల్  కు గుద్దినది, సత్యనారాయణ హెల్పర్ కి టైర్ కాల్ మీద పడడం జరిగింది, అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరిగిన సౌదా కంపెనీ పై సింగరేణి సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటదో  తెలియజేయాలి. కాంట్రాక్ట్ లేబర్ కి గతంలో ఒక వర్కర్ కే మెడికల్ ఫెసిలిటీ ఉండేది కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మెడికల్ ఫెసిలిటీ ఇచ్చే విధంగా చూడాలి,

ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎయిడ్ రెస్క్యూ ట్రైనింగ్ ఇస్తే వారికి సేఫ్టీ మీద పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుందని తెలపడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు వర్కర్ ని ఎక్కడైనా తీసుకుంటారు, కానీ వారి తల్లిదండ్రులను పిల్లలను కూడా డైరెక్టు రిఫరల్ లేకుండా చూడాలి.ఇంత పెద్ద సోలార్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రైవేట్ వారి చేతిలో ఉంది సోలార్లొ సింగరేణి సంబంధించిన మ్యాన్ పవర్ ఉంటే సింగరేణి ఆధిపత్యం లో ఉంటూదని మన మ్యాన్ పవర్ సింగరేణి సంబంధించిన టెక్నీషియన్స్, జూనియర్ అసిస్టెంట్ అలాగే జనరల్ అసిస్టెంట్ లను తీసుకోవడం వల్ల సింగరేణి సంస్థ అభివృద్ధి పదంలో నడుస్తుందని కోరుచున్నాం. పైన తెలిపిన విషయాలు ట్రైపాడెడ్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతిదిధులు,వర్క్ మైన్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.