12 March, 2026 | 2:23 AM

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందు నిలపాలి

12-03-2026 12:38 AM

అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై 

కలెక్టర్‌తో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సమీక్ష

నిజామాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధిపై, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ల పై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరతగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దన్ పాల్ సూర్యనారాయణ బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే నిర్మించి అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావలసిన యూజీడి పనుల నిధుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ సూచించారు.

బోధన్ బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులను పూర్తిచేసి అర్హులైన వారికి కేటాయించాలన్నారు. గత 12 రోజుల క్రితం 12 శాఖల ముఖ్య అధికారులతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో తాను రివ్యూ చేపట్టడం జరిగిందని ఆ రివ్యూ కు సంబంధించిన పురోగతిని తెలుసుకునేందుకు తిరిగి ఈ రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నా నన్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్దె తన లక్ష్యమని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.