రామప్పను సందర్శించిన నీతి ఆయోగ్ బృందం
వెంకటాపూర్, మార్చి 12 (విజయక్రాంతి): మండలంలోని ప్రసిద్ధ గాంచిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడమైన రామప్ప దేవాలయాన్ని గురువారం నీతి అయోగ్ గ్రేడ్1 కన్సల్టెంట్ క్రిష్ణన్ గోపాల్, కో-ఆర్డినేటర్ రవిష్ లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసా దాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈ వో ఇమ్మడి భాస్కర్ శాలువాతో నీతి ఆయో గ్ బృందాన్ని సత్కరించారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళా విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వారికి వివరించారు.
అధికారులు ఆలయ నిర్మాణ వైభవం, శిల్పకళ ప్రత్యేకతలను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం రామప్ప సరస్సు, ప్రకృతి అందాలను తిలకించారు. వారి వెంట ఈ దేవాదాయ శాఖ సిబ్బంది అవినాష్, సంతోష్, టూరిస్ట్ పోలీస్ అరుణ్ తదితరులు ఉన్నారు.రామప్పను దర్శించుకున్న మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పను మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు వారి బృందంతో సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం ప్రసిద్ధ రామప్ప సరస్సును సందర్శించారు. వారి వెంట వీరమల్ల శ్రీనివాస్ రావు, వకుళాభరణం శ్రీనివాస్, జనగాం నాగరాజు, జూపాక రమేష్, అంజి, టూరిస్ట్ పోలీసులు తదితరులు ఉన్నారు.




