29 June, 2026 | 6:29 PM

కాంగ్రెస్ పార్టీ పటిష్టతతో పాటు సంఘం అభివృద్ధికి కృషి చేయండి

29-06-2026 05:32 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్న మెరుపు భోజనను ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు మాజీ అధ్యక్షులు బొమ్మ కంటి రమేష్ తో పాటు చేనేత పద్మ సమైక్య జిల్లా అధ్యక్షులు మోరే ఆశన్న లతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పటిష్టతతో పాటు పద్మశాలి కులాన్ని ఏకతాటిపైకి వచ్చి పటిష్ట పరచాలని కోరారు.

పార్టీ కల్పించిన  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు మూడు శంకరయ్య కెఆర్కెకె కాలనీ సంఘం అధ్యక్షులు కుర్ర నరేష్ సుభాష్ నగర్ గౌరవ అధ్యక్షులు నందు తిరుపల్లి సంఘం కోశాధికారి ముదకంటి సుధాకర్ ఆదిలాబాద్ పట్టణ పట్టణ శాలి మహిళా అధ్యక్షురాలు తన్నీరు నవత ఆసం రమాదేవి గౌరవ అధ్యక్షురాలు శంకరమ్మ న్యూ పాల్గొన్నారు.