13 March, 2026 | 8:24 AM

అంకితభావంతో పనిచేసి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి

13-03-2026 12:23 AM
  1. గ్రామ, పట్టణ సర్వతో ముఖాభివృద్ధికి  పనిచేయాలి

గ్రామ సభలు నిర్వహించి నిధులను ఖర్చు చేయాలి

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలి

99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క.

మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): గ్రామాల్లోని సర్పంచులు, పట్టణా ల్లోని వార్డు కౌన్సిలర్లు ప్రజలను తమ కు టుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షే మ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువా రం మహబూబాబాద్ పట్టణంలోని  పి.ఎస్. ఆర్ ఫంక్షన్ హాల్ లో  జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమములో భాగంగా  నూతనంగా ఎన్నికైన మహబూబాబాద్ జిల్లాలోని  గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు  మహిళా, శిశు సంక్షేమ, సెర్ప్,

వైద్య,ఆరోగ్య, విద్య, సంక్షేమ, పర్యావరణ, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మార్కెటింగ్, సహకార, పౌర సరఫరాల, మున్సిపల్ (పురపాలక), పంచాయతీ రాజ్, పోలీస్ రవాణా, గృహ నిర్మాణ, విద్యుత్,  యువజన, క్రీడా శాఖల పై శిక్షణ తరగతులు నిర్వహించగా మహిళా, శిశు సంక్షేమం, వైద్యం పై శిక్షణ కార్యక్రమా న్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. జిల్లాలోని  గ్రామ సర్పంచులకు, ము న్సిపల్ కౌన్సిలర్లకు 12 శాఖలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హా జరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ గ్రామపంచాయ తీగా తీర్చిదిద్దడానికి ప్రతి సర్పంచ్ కృషి చే యాలన్నారు. 

దేశానికి పట్టుకొమ్మలే గ్రా మాలని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటి తో భావించుకోవాలని, ప్రజా ప్రతినిధులు స్వార్థం కోసం పనిచేయకుండా నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించిన ప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందన్నారు.

గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 6 వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు  కేటాయించిందని, మరో 12 వందల కోట్ల రూపా యలు రావాల్సి ఉన్నాయని, ఆ నిధులను తీసుకోరావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామా లలో ప్రజా ప్రతినిధుల ప్రాతినిద్యం లేకపోయినప్పటికీ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిందని, ఆనాడు చేసిన పనులకు కొం త మేరకు బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు.

ఇటీవల సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నే డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు, పురపాలక కౌన్సిలర్లకు 12 శాఖలపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణను ఏర్పాటు చేశామని, శిక్షణలో అవగాహన చేసుకున్న ప్రజా ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి తొమ్మిది రకాల అంశాలను పొందుపరచిందని, వాటిని అవగాహన చేసుకుని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలన్నారు.

ఉత్తమ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు, మరో రెండు గ్రామపంచాయతీలకు అదనంగా నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు. మారుమూల గ్రామాలు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీతక్క తెలిపారు. శిక్షణ శిబిరానికి గైర్హాహాజరైన వారికి వారి యొక్క వివరాలు తెలుసుకొని మళ్ళీ తరగతులు నిర్వహించాలని, కలెక్టర్ కు సూచించారు.

ప్రజా ప్రతి నిధులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి గ్రామాలు , పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచుల పాత్ర కీలకం, ప్రభుత్వ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందే వి ధంగా,చొరవ చూపాలని, శిక్షణలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని పరిగణలోకి  తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ,

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటో త్ రాంచంద్రునాయక్, ఎం.ఎల్.సి తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ మురళీ నాయక్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, వైస్ చైర్మెన్ సూర్నపు సోమయ్య, జెడ్పిసిఓ పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధు సూదన రాజు, జిల్లా అధికారులు, జిల్లా అధికారులు,మునిసిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.