13 March, 2026 | 6:06 AM

వాణిజ్య అవసరాలకు వంటగ్యాస్ వినియోగించొద్దు

13-03-2026 12:28 AM

మహబూబాబాద్, మార్చి12 (విజయక్రాంతి): వాణిజ్య అవసరాలకు వంటగ్యాస్ వినియోగించోద్దని, వంట గ్యాస్ సిలిండర్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ సిఐ వసంత్ కుమార్, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ వీరలక్ష్మి, ఎస్ ఐ  హుస్సేన్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సివిల్ సప్లై, విజిలెన్సు,

ఎన్ఫోర్స్మెంట్ అధికారులు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక షాపులో అక్రమంగా నిల్వ వున్న హెచ్పీ గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్లు 3,  ఇండెన్ గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్, 5 కిలోల  ఖాళి సిలిండర్లు7, 3 కిలోల  ఖాళి సిలిండర్లు 12 గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లను తమ వద్ద ఉంచుకున్న వారిపై 6 ఎ కేసు నమోదు చేశారు.