ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన నిర్మల జగ్గారెడ్డి
సదాశివపేట, మే 27: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం సదాశివపేట పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మంది రంలో పట్టణ సమాఖ్య మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇం దిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమా న్ని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు.
ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల స్థాపన, వడ్ల కొనుగోలు కేంద్రాలు, మహిళా శక్తి బజార్లు వంటి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. అదేవిధంగా వడ్డీ లేని రుణాల పరిమితిని బ్యాం కుల ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఎంసీలు, సీఓలు, ఆర్పీలు, ఓబిలు, స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.






