8 July, 2026 | 2:54 AM

ఈసీఐఎల్-శ్రీశైలం మధ్య కొత్త సూపర్ లగ్జరీ బస్సు

08-07-2026 12:00 AM

పికెట్ డీఎం శ్రీనివాసరావు

జూలై 9 నుంచి సేవలు అందుబాటులోకి..

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాం తి): ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల ప్రజల కు శ్రీశైలం వెళ్లేందుకు మరో బస్సు సౌకర్యం అందుబాటు లోకి రానుంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు టీజీ ఆర్టీసీ ఈ నెల9వ తేదీ నుంచి ఈసీఐఎల్‌శ్రీశైలం మధ్య సూపర్ ల గ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు పికెట్ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బయలుదేరే బస్సు ఈసీఐఎల్ చేరుకుని అక్కడి నుంచి ఉదయం 5 గంటలకు శ్రీశైలం వైపు ప్రయాణం సాధిస్తుంది అన్ని తెలిపారు.