8 July, 2026 | 3:45 AM

‘డబుల్’ ఇళ్ల కేటాయింపుపై విచారణ జరిపించాలి

08-07-2026 12:00 AM

ప్రజావాణిలో బీఆర్‌ఎస్ నాయకుడి వినతి

ఉప్పల్, జులై 7 (విజయక్రాంతి) : మల్లాపూర్ డివిజన్లోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ను స్థానికుల కాకుండా బయటి వాళ్లకు  కేటాయించారనీ, దీనిపై సమగ్ర విచారణ జరిపి స్థానికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మం జూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  మల్లాపూర్ బిఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లాపూర్ డివిజన్‌లోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల  నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానికంగా నివసించే వారు కాకుండా బయ టి వారికి ఇల్లును కేటాయించారని..  దాదా పు 50 శాతం బయటి వారే డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసిస్తున్నారనీ ఆరోపించా రు.  స్థానికంగా ఉండే నిరుపేద కుటుంబా లు డబుల్ బెడ్‌రూమ్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ  కేటాయించలేదనీ మండిపడ్డారు. దీనిపై అధికారులు విచారణ జరిపించి, స్థానికులకు ఇళ్ళు  వచ్చే విధంగా చర్యలు తీసు కోవాలని కోరారు.