24 April, 2026 | 2:33 PM

Breaking News

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •   ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •  

ఎంపీ కావ్యను కలిసిన బార్ అసోసియేషన్ నూతన ప్రతినిధులు

24-04-2026 12:00 AM

హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఇటీవల నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు చకిలం ఉపేందర్, ప్రతినిధులు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలు, కోర్టు సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు న్యాయసేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం వంటి అంశాలపై చర్చించారు.

బార్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీ కావ్య హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, కోర్టుల మౌలిక వసతుల పెంపు కోసం తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్తో పాటు సభ్యులను ఎంపీ అభినందించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు లలిత కుమారి, సాంబశివరాజు, ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.