అసాధ్యాన్ని సాధించడమే ‘భగీరథ’ ప్రయత్నం
24-04-2026 | 12:00am
మంచిర్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉంటే అసాధ్యమైన పనిని సాధించవచ్చునని అని చూపిన మహనీయుడు భగీరధుడు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భగీరథ మహర్షి జయంతి ఉత్సవానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తలపెట్టిన పనిని పూర్తి చేసే వరకు ఎంత కాలమై నా అంకితభావంతో ప్రయత్నించాలని, భగీరధుడు ఆచరించి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.






