24 April, 2026 | 4:00 PM

Breaking News

విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి భరోసా   •   అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి   •   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి   •   దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి   •   తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్   •   'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు   •   నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన   •   తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి   •  

ఉపాధి పనులు పారదర్శకంగా నిర్వహించాలి

24-04-2026 12:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఉపాధి పనుల నిర్వహణలో ఎలాంటి అవినీతి లేకుండా, నాణ్యత పాటిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం తాంసి మండలం పొన్నారి గ్రామ శివారులో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూడికతీత పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, మస్టర్ రోల్స్ను తనిఖీ చేశారు.

పనుల పరిశీలనలో భాగంగా కూలీలతో ముఖాముఖి మాట్లాడుతూ, పని ప్రదేశంలో మీకు కావాల్సిన సౌకర్యాలు అందుతున్నాయా..? సకాలంలో వేతనాలు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన జరగాలని, పనుల నిర్వహణలో ఎక్కడా రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలనిఆదేశించారు.

ఎండ తీవ్రత పెరుగుతున్నందున కూలీలు అస్వస్థతకు గురికాకుండా మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, మండల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీ, సర్పంచ్ భీమన్న, ఏపీఓ విజయ, టెక్నికల్ అసిస్టెంట్ పుష్ప, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.