24 August, 2026 | 3:30 AM

టీఎన్జీవోస్ ఈఎన్టీ ఆస్పత్రి నూతన కార్యవర్గం

24-08-2026 12:33 AM

యూనిట్ అధ్యక్షుడిగా తూముకుంట రాజు

కార్యదర్శిగా జయకర్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఈఎన్టీ ఆస్పత్రి యూనిట్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ముఖీం ఖురేషి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో టీఎన్జీవోస్ ఈఎన్టీ ఆస్పత్రి యూనిట్ అధ్యక్షులుగా తూముకుంట రాజు, కార్యదర్శిగా జయకర్, కోశాధికారిగా ఎస్. రవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సురేందర్, కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి కురాడి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు వారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తూముకుంట రాజు మాట్లాడుతూ, ఈ నెల 27న నిర్వహించనున్న ఉద్యోగుల హక్కుల సాధన ధర్నా కార్యక్రమానికి ఈఎన్టీ ఆస్పత్రి ఉద్యోగ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు.