ఆళ్లపల్లి నుంచి అనిశెట్టిపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు పట్ల హర్షాతిరేకాలు
- మంత్రి పొంగులేటి, శాసనసభ్యులు పాయం చిత్రపటానికి పాలాభిషేకం
- కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వాసం శ్రీకాంత్
ఆళ్ళపల్లి. ఆగస్టు 23, ( విజయక్రాంతి) : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఇందు కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి ప్రధాన సమస్యగా ఉన్న ఆళ్ళపల్లి నుండి అనిశెట్టిపల్లి వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబల్ రోడ్డు గా మార్చి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని మండల ప్రజల విజ్ఞప్తిని శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చొరవతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు, ఆళ్లపల్లి నుండి రాయపాడు కిన్నెరసాని వరకు ఆళ్లపల్లి నుండి అనిశెట్టిపల్లి వరకు డబల్ బి టి రోడ్డు మొత్తం రూ 98 కోట్ల 88 లక్షలు వంతెనల పునరుద్ధరణతో మంజూరు చేయడం జరిగిందన్నారు .ఆళ్లపల్లి నుండి రాయపాడు కిన్నెరసాని బ్రిడ్జి వరకు రూ 30. 21 కోట్లు, 11 కిలోమీటర్ల కిన్నెరసాని బ్రిడ్జి నుండి అనిశెట్టిపల్లి వరకు 25 కిలోమీటర్లు రూ 68 . 67 కోట్ల వ్యయంతో మొత్తం అంచనా విలువ రూ 98. 88 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయం, మంత్రి పొంగులేటికి మండల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఇప్పటికే అంతర్గత రోడ్లు, ఇందిరమ్మ గృహాలకు సంబంధించి 90 శాతం పూర్తి అయ్యయని ,మలి విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో బాణాసంచ కాల్చి మంత్రి పొంగులేటి శాసనసభ్యులు వెంకటేశ్వర్లు చిత్రపటాలకు పాలాభిషేకం చేసే మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసం సుస్మిత, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, ఉపసర్పంచ్ వాగబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.






