విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ కేజీబీవీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలి.గత కొంతకాలంగా పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో వాటి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఏబీవీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆహారం నిర్ణీత సమయంలో అందడం లేదని ప్రత్యక్షంగా గమనించాము. విద్యార్థినులకు సమయానికి భోజనం అందకపోతే వారు చదువుపై ఎలా దృష్టి కేంద్రీకరిస్తారు.
వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. హాస్టల్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెళ్లినప్పటికీ, హాస్టల్ సిబ్బంది మా మహిళా కార్యకర్తలను, నాయకులను గేటు బయటే అడ్డుకుని లోపలికి అనుమతించలేదు. "మీకు అనుమతి ఇవ్వము" అంటూ విద్యార్థినుల సమస్యలను తెలుసుకునే అవకాశాన్ని నిరాకరించడం బాధాకరం. విద్యార్థినుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌లో ఆహార సరఫరా, మౌలిక సదుపాయాలు మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలి.






