ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ అమలొద్దు
ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు పేరుతో విద్యను వాణిజ్యీకరణ దిశగా నెట్టొద్దని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. విద్యను కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేలా ఉన్నదన్నారు. ప్రభుత్వం అమలుకు పూనుకోవడం దుర్మార్గపు చర్య అని తెలిపింది.
ఎన్‌ఈపీ అమలు పేరుతో మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్, నాలుగేళ్ల డిగ్రీ, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వంటి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని అస్థిరంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. మధ్య లో ఎగ్జిట్ అనే పేరుతో విద్యార్థులను బయటకు నెట్టే విధానమే దాగి ఉందని, పేద, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఆర్థిక ఒత్తిడితో చదువు మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.




