18 August, 2026 | 3:34 AM

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

18-08-2026 01:41 AM

మల్కాపూర్ శివారులో ఘటన

చేవెళ్ల, ఆగస్టు 17 (విజయక్రాంతి): చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్ వార్డు శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడిపూడి హరీ ష్ (38) సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్లోని నార్సింగి గండిపేట్ పరిధిలోని మై హోమ్ అవతార్లో నివసిస్తున్న హరీష్ హైదరాబాద్ నుంచి చేవెళ్ల మండలంలోని రామన్నగూడకు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమా దం జరిగింది. హరీష్కు తలకు రెండు కాళ్లకు ఛాతి భాగంలో బలమైన గాయం కావడం తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తె లిపారు. కారును నడుపుతున్న కావ్య తలకు తీవ్ర గాయమవ్వగా పోలీస్ లు చేవెళ్ల ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తం డ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.