ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, ఏప్రిల్ 22: ప్రభుత్వ దావఖానాలో వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్‌ఆర్ ) అన్నారు. బుధవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులకు అందుతున్న వైద్య సేవలను, ఆసుపత్రి మౌలిక వసతులను, సిబ్బంది పని తీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు మందుల పంపి ణి ఆహారంపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమయపాలన పాటించి పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చూడాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అన్ని విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రంగయ్యను ఆదేశించారు.






