23 April, 2026 | 3:14 AM

కోర్టు తీర్పు వచ్చేవరకు ఆ ర్యాంపును నిలుపుదల చేయాలి

23-04-2026 01:52 AM

గిరిజన సంఘాల ఆందోళన

చర్ల, ఏప్రిల్ 2౨ ( విజయక్రాంతి):   చర్ల మండలం సుబ్బపేట పంచాయతీ బిఎస్  రామయ్య నగర్ సంబంధించిన శ్రీ కొమరం భీమ్ ఆదివాసి మహిళ ఇసుక సొసైటీ లో గతంలో అనేక అక్రమాలు జరగాయని గత జిల్లా కలెక్టర్ కి,డిసీఓకి.  టిజి ఎండిసిపిఓ.కి సొసైటీ సభ్యులు  ఫిర్యాదు చేసి ఉన్నప్పటికీ అక్రమాలు చేసిన పదిమందిపై  ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రస్తుత కలెక్టర్ కి ఫిర్యాదు చేసి బుధవారం  టీజీఎండిసిపిఓ ఆఫీసుకు వెళ్లి  సంఘలెటర్ ప్యాడ్ మీద సంఘ  నాయకులు ఫిర్యాదు చేస్తే మీది పనికిరాదు అనే నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెబుతున్న టీజీఎండిసి పిఓ.షెడ్యూల్ ఏరియాలలో ఆదివాసి సంఘాలు పనిచేస్తున్నది అన్న విషయం కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని.

డబ్ల్యూ పి  నెంబర్  2713/2026. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కోర్టు దిక్కరణ తో ఇసుక డంపింగ్ చేస్తున్న గిరిజనేతర వ్యక్తి మధు పై ఏజెన్సీ చట్టాల ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పు వచ్చేవరకు ఆ ర్యాంపు పై  ఎలాంటి పనులు చేయకుండా నిలుపుదల చేయాలని సంఘం నాయకులు పాయం సత్యనారాయణ, ఎలకం  రామకృష్ణ  ఒక ప్రకటనలో తెలిపారు.