2 June, 2026 | 7:12 PM

Breaking News

కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •  

పాత పద్ధతిలోనే నీట్

02-06-2026 12:00 AM
  1. పెన్ అండ్ పేపర్ విధానంలోనే రీ-ఎగ్జామ్
  2. మరో 20 రోజుల్లోనే పరీక్ష ఉంది.. 
  3. ఇప్పటికప్పుడు సీబీటీగా మార్చలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూన్ ౧: నీట్ యూజీ రీఎగ్జామ్ మరో 20 రోజుల్లోనే ఉంది కాబటి, ఇప్పటికిప్పుడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కు ఏర్పాట్లు చేయలేమని, పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది. నీట్‌ను సీబీటీ విధానంలో నిర్వ హించాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అర వింద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పరీక్షా విధానాన్ని మార్చడం వల్ల ఎన్నో ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఇప్పటికే పరీక్ష రద్దయిందని, ఇంకా విద్యార్థులను ఇబ్బంది పెట్టలేమని అభిప్రాయపడింది. తిరిగి పరీక్ష నిర్వహించే ఒత్తిడి లో ఎన్టీఏ ఉందని, ఇలాంటి సమయంలో పరీక్షా విధానాన్ని మార్చడం సరికాదని స్పష్టం చేసింది.

పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. తదుపరి విచారణ జూలై కి వాయిదా వేసింది. మరోవైపు వచ్చే ఏడా ది నుంచి నీట్‌ను సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని ఎన్టీఏ  తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.