2 June, 2026 | 6:26 PM

Breaking News

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •  

కొత్తగా ఐదుగురు ‘సుప్రీం’ న్యాయమూర్తులు

02-06-2026 12:00 AM

న్యూఢిల్లీ, జూన్ 1: దేశ అత్యున్నత న్యా యస్థానంలో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. నూతనంగా బా ధ్యతలు చేపట్టనున్న వారిలో నలుగురు వివి ధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీం కోర్టు సీని యర్ న్యాయవాది.

కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం.. సు ప్రీంకోర్టు న్యాయమూర్తులు గా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ చంద్రశేఖర్ (బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షీల్ నాగు (పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ (మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అరుణ్ పళ్లి (జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి), సుప్రీం కోర్టుకు చెందిన ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది వి.మోహన ఉన్నారు.