నీట్ పేపర్ లీక్!?
- గెస్ పేపర్, పరీక్షా పత్రంలో ఒకేలా 140 ప్రశ్నలు
- రాజస్థాన్ ఎస్‌ఓజీ పోలీసుల దర్యాప్తు
జైపూర్, మే 11: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-2026 పేపర్ రాజస్థాన్‌లో లీక్ అయినట్లు కలకలం సృష్టిస్తోంది. గెస్ పేపర్, పరీక్షా పత్రంలో ఒకేవి ధంగా దాదాపు 140 ప్రశ్నలు ఉన్నట్లు, ఈ మెటీరియల్ పరీక్షకు రెండు రోజుల ముందే రాజస్థాన్‌లోని సికార్‌లో బయటికి వచ్చినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) పోలీసులు తెలిపారు.
ఈ మెటీరియల్‌ను విద్యార్థులకు రూ.20 వేల నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో నీట్ విద్యార్థులు ఆందోళనలు చెందుతున్నారు. ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నల్లో దాదాపు 140 వరకు ప్రాక్టీస్ పేపర్‌లోనూ యధావిధిగా ఉన్నాయి. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే విధంగా ఉన్నాయా లేదా ఎవ రైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






