13 May, 2026 | 4:51 AM

నీట్ నిర్వహణ అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలి:ఎస్‌ఎఫ్‌ఐ

13-05-2026 12:00 AM

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నీట్ పరీక్ష నిర్వహణ అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టీ.నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకవడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధాకారంలోకి పోనుందని పేర్కొన్నారు.

2024లోనూ నీట్, నెట్  పేపర్లు లీకై పరీక్షలు రద్దయినప్పుడే పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తాయన్నారు. వాటిని సరిదిద్దుకోకపోవంతో అటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. నీట్  పేపర్ లీకేజీపై తక్షణమే సమగ్రమైన విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు.