29 July, 2026 | 8:51 PM

జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

29-07-2026 07:32 PM

పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలని పిలుపు

డా. మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో నిర్వహణ 

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో ఎన్‌సీపీ – ఎన్‌డీఏ కూటమి  రాష్ట్ర కార్యాలయాన్ని 2026 జూలై 30వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న వారు డా. మద్దిశెట్టి సామేలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్. ఈ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం దివంగత అజిత్ పవార్  ఆశీస్సులతో, అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షురాలు  సునేత్రా పవార్ , రాజ్యసభ సభ్యులు  పార్థ్ పవార్ , ఎన్‌వైసీ జాతీయ అధ్యక్షులు  ధీరజ్ శర్మ  ఆశీస్సులతో నిర్వహించబడుతుందని తెలిపారు.