‘ఎన్‌బీకే112’ ప్రారంభం
26-06-2026 12:41 AM
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న కొత్త సినిమాను ‘ఎన్‌బీకే112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
సినీ ప్రముఖులు సురేశ్‌బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీశ్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేశ్ క్లాప్ కొట్టగా, బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని మొదటి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.






