ఆల్ఫా.. ఆటిట్యూడ్‌కు ప్రతీక
యష్‌రాజ్ ఫిలమ్స్ బ్యానర్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. ఆలియా భట్, శార్వరి వాఘ్‌ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందుతోంది. ఆదిత్య చోప్రా నిర్మాణంలో శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆలియా తెలియజేశారు. ఆటిట్యూడ్‌కు ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఆలియా పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. “నేను షూటింగ్ ఎంజాయ్ చేసిన సినిమాల్లో ‘ఆల్ఫా’ కూడా ఒకటి. యాక్షన్, గ్రాండియర్, అడ్వెంచర్లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషం. మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త అనుభూతి. కథ ఇద్దరు మహిళ కథానాయికల చుట్టే తిరుగుతుంది. అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం. ఇలాంటి గొప్ప స్క్రిప్ట్లు మనం అరుదుగా చూస్తుంటాం. ‘ఆల్ఫా’ అనేది ఆటిట్యూడ్‌కు, సెలెబ్రేషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంది. మేం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. మా ఉత్సాహం అంతా తెరపై ప్రతిబింబిస్తుంది” అని తెలిపారు.






