13 May, 2026 | 11:30 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

22, 23వ తేదీల్లో జాతీయ సెమినార్

11-12-2025 12:00 AM

కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో జరగనున్న జాతీయ సెమినార్ వివరాలను కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ ప్రిన్సిపాల్ శాంతి వేదుల బుధవారం వెల్లడించారు. భారతీయ భాషా పరివార్ విద్యా భారతి ఉచ్ఛ శిక్షా సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 22, 23 తేదీల్లో జరగను న్న రెండు రోజుల సెమినార్‌లో భారతీయ భాష ల సేంద్రీయ ఐక్యత, మాతృభాష ఆధారిత బోధన, బహుభాషా విద్య వంటి అంశాలపై నిపుణుల చర్చలు, పుస్తకావిష్కరణలు, అభ్యాసకుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపా రు. భారతదేశం యొక్క భాషా వారసత్వాన్ని కొత్త దృక్పథంలో అర్థం చేసుకోవడమే సెమినార్ లక్ష్య ని ఆమె పేర్కొ న్నారు. ఎన్‌ఈపీ పేర్కొన్న బహుభాషా విద్యకు ఇది మరింత బలాన్నిస్తుందని శాంతి వేదుల అన్నారు.