2 March, 2026 | 8:50 PM

వైజ్ఞానంపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

02-03-2026 06:55 PM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమత విశ్వనాథరావు, సీఐ రమేష్ 

జైనూర్,(విజయక్రాంతి): విద్యార్థులు వైజ్ఞాన శాస్త్రం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథరావు, సి ఐ రమేష్ లు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం జైనూర్ మండల కేంద్రంలోని కేరళ గ్రామర్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆయా ప్రాజెక్టులను పరిశీలించారు.

విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగాలు, ప్రాజెక్టులు చాలా ఆకట్టుగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడి ఎస్ సిడిపిఓ ఇందిరమ్మ, సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్,  సిర్పూర్ యు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఉదయ్ కిరణ్, మండే మధుకర్, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చెర్ల లక్ష్మణ్, సీనియర్ నాయకుడు మేశ్రం అంబాజీ, నాయకులు అజ్జులాల, షేక్ రహీ, షేక్ అబ్బు, షేక్ మజార్, బుతాలే కిరణ్, షఫీక్ అన్సారి, సూపర్వైజెర్ సృజన, పాఠశాల కరస్పాండెంట్ షేక్ జమీల్, ప్రిన్సిపాల్ షేక్ అఖిల్, డైరెక్టర్ రిజ్వానా కౌసర్, ఉపాధ్యాయులు, పాఠశాల పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.