2 March, 2026 | 8:49 PM

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

02-03-2026 06:52 PM

- జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి స్థాయిలో  ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తుపై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వంటి అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దని అన్నారు.  ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.