ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో కన్నుమూసిన రైతు
17-05-2026 12:07 PM
వరంగల్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో కన్నుమూసిన కర్షకుడి ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఆదివారం జరిగింది. గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అనే రైతు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో కొద్దిరోజులుగా నిరీక్షిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై ధాన్యం కొనుగోలు కేంద్రంలోని పడిపోగా అతనికి సహచర రైతులు, స్థానిక ఆర్ఎంపీ వైద్యులు సిఆర్పి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటనతో రైతుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడం వల్లే రైతు మరణానికి కారణమైందని ఆరోపిస్తున్నారు.






