రేపు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
17-05-2026 11:05 AM
కేరళ: కేరళలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ గురువారం విడి సతీశన్‌ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కేరళ ఏఐసీసీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షి, ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తెలిపారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సతీశన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వీడీ సతీశన్ తో పాటు 20 మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.






