10 May, 2026 | 12:05 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 08:46 PM

జడ్చర్ల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్షర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశ ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి. వి. రామన్ శాస్త్రీయ ఆవిష్కరణలను స్మరించుకుంటూ జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవం విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం దేశ అభివృద్ధికి ముఖ్యమైన సాధనమని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాలు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. కౌన్సిలర్ విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.